Dailyhunt
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ రన్వే పై బోల్తాపడిన కారు

ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ రన్వే పై బోల్తాపడిన కారు

శింగరాయకొండ (ప్రకాశం) : ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ రన్వే పై కారు బోల్తాపడి మంటలు చెలరేగిన ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా శింగరాయకొండలో జరిగింది. శింగరాయకొండ జాతీయ రహదారి పరిధిలోని ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ రన్వే మీద నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళుతున్న కారు బోల్తా పడి మంటలు చెలరేగాయి.

కారులో ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ఒంగోలు రిమ్స్‌ కు తరలించారు. ఎస్సై బి మహేంద్ర ఘటనా స్థలానికి చేరుకొని టంగుటూరు నుంచి వచ్చిన ఫైర్‌ ఇంజన్‌ తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti