Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎంపి సందీప్‌పాఠక్‌ పై పంజాబ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌

ఎంపి సందీప్‌పాఠక్‌ పై పంజాబ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌

చండీగఢ్‌ : రాజ్యసభ ఎంపి సందీప్‌ పాఠక్‌పై నాన్‌ బెయిల్‌ సెక్షన్ల కింద పంజాబ్‌ పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వేర్వేరు జిల్లాల్లో వేర్వేరుగా పంజాబ్‌ పోలీసులు ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇటీవలే సందీప్‌ పాఠక్‌ ఆమ్‌ఆద్మీ (ఆప్‌) పార్టీ నుంచి బిజెపిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం జరిగిన కొద్దిరోజులకే సందీప్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడం పట్ల బిజెపి మండిపడింది. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌ సిఎం భగవంత్‌మాన్‌ రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడ్డారని ఆ రాష్ట్ర బిజెపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశ్వనీ శర్మ తీవ్రంగా విమర్శించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti