Dailyhunt
ఫలితాలు విశ్లేషించుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం : పి.రాజివ్

ఫలితాలు విశ్లేషించుకుని నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం : పి.రాజివ్

తిరువనంతపురం : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కేరళ మంత్రి పి. రాజీవ్ స్పందించారు. ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడారు. "కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర కూటమికి (ఎల్ డి ఎఫ్ ) ఇది ఒక ఊహించని ఎదురుదెబ్బ.

గత 10 ఏళ్లుగా కేరళం ప్రజలకు మేము ఇచ్చిన హామీలను అమలు చేయడానికి మా వంతు అత్యుత్తమ ప్రయత్నం చేశాము. కానీ ప్రజాతీర్పు మాత్రం మాకు పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. ఈ తీర్పు నుండి మేము గుణపాఠాలు నేర్చుకోవాలి, ఫలితాలను విశ్లేషించుకోవాలి, అలాగే కేరళ ప్రజల మద్దతును తిరిగి పొందడానికి తగిన చర్యలు తీసుకోవాలి… ఈసారి, ఎల్ డి ఎఫ్ ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలి. అదే ఇప్పుడు మా బాధ్యత." అని పి రాజివ్ తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti