Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఫోటో కోసం ఎండలో ఉపాధి కూలీలు

ఫోటో కోసం ఎండలో ఉపాధి కూలీలు

ప్రజాశక్తి - గణపవరం : ఉపాధి హమీ కూలీలకు రెండు పోటోలు విధానాన్ని రద్దు చేయాలని పదిగంటలకే ఇళ్ళకు పంపించే విధానం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్సి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

గురువారం గణపవరం మండలంలోని పిప్పర ఎర్రకాలువలో పని చేస్తున్న కూలీల దగ్గరకు వెళ్ళి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ ఆధారత మస్తరు వల్ల కూలీలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నరని అన్నారు. పనిచేసిన 15 రోజులలో వేతానాలను ఇవ్వవలిసి ఉండగా గత అయిదు వారాల నుండి వేతనాలు పడటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలురైతు సంఘం జిల్లా సహయ కార్యదర్సి పెచ్చేట్టి నరశింహమూర్తి రైతుసంఘం మండల కార్యదర్సి కొత్త వి బి జి రాంజి చట్టం వలన కూలీలు రెండవ ఫోటో కోసం ఎండలో వేచి చూడవలిసిన పరిస్థితి వలన కూలీలు వడదెబ్బకు గురుయ్యే ప్రమాదం ఉందని అన్నారు. పని ప్రాంతంలో మజ్జిగ మంచినీరు అందించే చర్యలు అధికారులు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పది గంటల లోపు కూలీలను ఇళ్ళకు చేరే విదంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కె ప్రియాంక, బి దుర్గాభావాని, వైదైవ ఆశ్విరాదం పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti