Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడి వాయిదా పడింది : ట్రంప్

గల్ఫ్ మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడి వాయిదా పడింది : ట్రంప్

వాషింగ్టన్‌ : ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌ వంటి తమ గల్ఫ్‌ మిత్రదేశాల అభ్యర్థన మేరకు ఇరాన్‌పై దాడి వాయిదా వేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా వెల్లడించారు.

అయితే యుద్ధానికి సంబంధించి అమెరికా- ఇరాన్‌ల మధ్య చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి అని ఆయన అన్నారు. మరోవైపు ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియన్ చర్చలు అంటే లొంగిపోవడం కాదు అని స్పష్టం చేశారు. అమెరికాతో.. దేశ హక్కుల పరిరక్షణ కోసం, గౌరవంగానూ, అధికారికంగానే చర్చల్ని ప్రారంభించినట్లు మసూద్‌ పెజెష్కియన్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti