Dailyhunt
గంజాయి నరహంతక ముఠాలను పోలీసులు అరికట్టాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

గంజాయి నరహంతక ముఠాలను పోలీసులు అరికట్టాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

  • కడప, పొద్దుటూరు, బద్వేలు, ఘటనలపై "సిట్‌" తో దర్యాప్తు చేయించాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : గంజాయి నరహంతక ముఠాలను పోలీసులు అరికట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.

చంద్రశేఖర్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా నగరాలు, పట్టణలు, మరికొన్ని ప్రాంతాల్లో గంజాయి నరహంతక ముఠాల ఇష్టరాజ్యంగా మారిందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో కడప, ప్రొద్దుటూరు, బద్వేలు తదితర ప్రాంతాల్లో జరిగిన వరుస హత్యల ఘటనలు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని తెలిపారు.

ఈ సంఘటనలపై సిట్‌ తో దర్యాప్తు చేపించాలని కోరారు. జిల్లాలోకి గంజాయి ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది, ఎవరు తెచ్చి అమ్ముతున్నారో, వారి అడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్యాక్షన్‌ గ్రామాల్లో 100 డైల్‌ పనిచేయకపోతే ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పారు. నేరాల నివారణకు ముందస్తుగా ప్రభుత్వం రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్న వాటి ఆనవాళ్లు ఏమి జిల్లాల్లో కనపడడం లేదన్నారు.

జిల్లా పోలీసు యంత్రాంగం డోన్‌ కెమెరాల పర్యవేక్షణ పెంచామని ఫోటోలు ప్రకటనలు చేస్తున్నారని వాటి నుంచి వచ్చే సమాచారం ఏమైందని ప్రశ్నించారు. రిమ్స్‌ లో ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌ పర్యవేక్షణ విఫలం కావడంతోనే రోగులకు రక్షణ కరువైందని పేర్కొన్నారు. ఇలాంటి కిరాయి హత్యలు మునుముందు జిల్లా ప్రజలు ఎన్ని చూడాల్సి వస్తుందో అని చర్చించుకుంటున్నారని తెలిపారు. జిల్లా క్రిమినల్‌ స్కూల్‌ అడ్డాగా మారకముందే నేర ప్రవఅత్తి కలిగిన వారిపై, వరుస నేరాలు చేసే వారిపై రౌడీషీటర్స్‌ ఓపెన్‌ చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భూ కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు చేసే వారిపై నిఘా పెంచాలని కోరారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.మనోహర్‌, ఎ.రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు కె.శ్రీనివాసులురెడ్డి, బి.దస్తగిరి రెడ్డి పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti