ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : కనిపెంచిన నా తల్లి గొప్పతనాన్ని గుర్తు పెట్టుకోవడం కోసమే మే నెలలో 2 ఆదివారం రోజు మాత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని నగరి నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎపిఐఐసి చైర్‌పర్సన్ ఆర్ కే రోజా పేర్కొన్నారు. చెన్నైలోని నూతన గహంలో మాత దినోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదర్ గాడ్స్‌గా పిలిచే రియా దేవతకు నివాళి అర్పించే ఈ నేపథ్యంలో మాత దినోత్సవాన్ని తొలిసారిగా గ్రీకు దేశంలో జరుపుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులను కనిపించే దేవతలుగా భావించే సంప్రదాయం మన దేశంలో ఉందని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను పూజించాలని తల్లిదండ్రులకు పిల్లలు బాసటగా నిలవాలని కోరారు.
రాష్ట్రంలోని మాతమూర్తులైన మహిళలందరికీ ఎమ్మెల్యే మాత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

