Dailyhunt
GOLD - తగ్గిన పసిడి ధరలు ..!

GOLD - తగ్గిన పసిడి ధరలు ..!

హైదరాబాద్ : హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి ప్రియులకు శుభవార్త అందింది. ఉదయం నుంచి నిలకడగా ఉన్న బంగారం ధరలు సాయంత్రం కల్లా ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో మన దేశంలో కూడా రేట్లు దిగివచ్చాయి. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,200 రూపాయల వరకు తగ్గింది. దీంతో మార్కెట్లో ఈ పసిడి ధర 1,37,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.

సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసేది ఈ రకం బంగారమే కాబట్టి వారికి ఇది పెద్ద ఉపశమనం. ధరలు ఇలాగే కొనసాగితే మరిన్ని బుకింగ్స్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు తగ్గినా వెండి రేటు మాత్రం నేడు స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్లో కేజీ వెండి ధర 2,70,000 రూపాయల వద్ద ఎలాంటి మార్పు లేకుండా ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా తేడాలు ఉండే అవకాశం ఉంది. కొనే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో ధరలు సరిచూసుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti