న్యూఢిల్లీ : బీహార్ రాజధాని పాట్నాలో ఈనెల 17న జిఎస్‌టి కౌన్సిల్ భేటీ కానుంది. ఈ భేటీకి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు.
పెట్రోల్, డీజిల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను వస్తుసేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని ఈ సమావేశం పరిగణనలోకి తీసుకొని చర్చించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

