Dailyhunt
గుజరాత్ బౌలర్ల హవా

గుజరాత్ బౌలర్ల హవా

  • బెంగళూరును కట్టడి చేసిన అర్షాద్, రషీద్, హోల్డర్
  • ఛాలెంజర్స్ పై టైటాన్స్ గెలుపు

అహ్మదాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జోరుకు గుజరాత్ టైటాన్స్ బౌలర్లు తొలిసారి కళ్లెం వేశారు.

దీంతో టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. అనంతరం గుజజరాత్ 15.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158పరుగులు చేసి సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్(43), బట్లర్(39) బ్యాటింగ్ లో రాణించారు. సాయి సుదర్శన్(6), సుందర్(12), షారుక్ ఖాన్(8) నిరాశపరిచినా.. తెవాటియా(27), రషీద్ ఖాన్(7) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. బెంగళూరు
బౌలర్లు భువనేశ్వర్ కుమార్ కు మూడు, షెఫర్డ్ కు రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిర్ణయాన్ని బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు. తమ పదునైన బౌలింగ్‌తో ఆర్సీబీని కట్టడి చేశారు. దేవదత్ పడిక్కల్ (40) ఒంటరి పోరాటం చేశాడు. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. విరాట్ కోహ్లీ కేవలం 13 బంతుల్లో 5ఫోర్లు, ఒక సిక్సర్‌తో 28పరుగులు చేశాడు. వీరి దూకుడుతో పవర్ ప్లేలో ఆర్సీబీ వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. మూడో ఓవర్లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో బెథెల్ (5) ఔట్ కాగా, ఆ తర్వాతి ఓవర్లోనే ప్రమాదకరంగా మారుతున్న కోహ్లీని రబడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఆర్సీబీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. దేవదత్ పడిక్కల్ ఒకవైపు నిలకడగా ఆడుతున్నా, మరో ఎండ్ నుంచి వికెట్ల పతనం కొనసాగింది. కెప్టెన్ రజత్ పటీదార్ (19) ఫర్వాలేదని పించినా, అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ (1), టిమ్ డేవిడ్ (9),కృనాల్ పాండ్యా (4)సింగిల్ డిజిట్ కే పరిమితమై పెవీలియన్ కు చేరారు.ఈ దశలో స్పిన్నర్ రషీద్ ఖాన్,పేసర్ అర్షద్ ఖాన్ తమ అద్భుత బౌలింగ్‌తో ఆర్సీబీ మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. ఒకవైపు వికెట్లు పడు తున్నా పడిక్కల్ 24 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో రొమారియో షెపర్డ్ (17), వెంకటేశ్ అయ్యర్ (12), భువనేశ్వర్ కుమార్ (15నాటౌట్) కాస్త పోరాడినా, జట్టును పోటీపడగలిగే స్కోరుకు చేర్చలేకపోయారు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్ 22 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు, రషీద్ ఖాన్ 19 పరుగులకేవి వికెట్లు పడగొట్టారు.జాసన్ హోల్డర్ 2వికెట్లు దక్కాయి.

స్కోర్ బోర్డు(సంక్షిప్తంగా)
బెంగళూరు : 155/10 (19.2 ఓవర్లలో)
పడిక్కల్ (40), కోహ్లి (28);
ఆర్షాద్ (3/22), రషీద్ ఖాన్ 2/19), హోల్డర్ (2/29)
గుజరాత్ టైటాన్స్: 158/6 (15.5 ఓవర్లలో)
గిల్ (43), బట్లర్ (39);
భువనేశ్వర్ కుమార్ (3/28), షెఫర్డ్ (2/30)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti