ప్రజాశక్తి - గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరులో బ్రాడిపేట, పట్టాభిపురం, బఅందావన్ గార్డెన్స్, శ్రీనివాసరావు పేట తదితర ప్రాంతాల్లో మైక్రో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు బయటికి రాకూడదని కమిషనర్ ఆదేశించారు. ఈ జోన్లలో ఉండే వార్డు వాలంటీర్లు అందుబాటులో ఉంటూ సహకరిస్తారని తెలిపారు.

