Dailyhunt
హార్మూజ్‌ జలసంధిని దాటిన మరో భారత నౌక 'గ్రీన్‌ ఆశా'

హార్మూజ్‌ జలసంధిని దాటిన మరో భారత నౌక 'గ్రీన్‌ ఆశా'

టెహ్రాన్‌: పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తల నడుమ మరో భారత జెండాతో ఉన్న ఎల్‌పిజి నౌక 'గ్రీన్‌ ఆశా' హార్ముజ్‌ జలసంధిని దాటింది.

ఈ ప్రాంతంలో సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఈ కీలక సముద్ర మార్గాన్ని దాటిన తొమ్మిదో భారత ట్యాంకర్‌ ఇదే కావడం గమనార్హం. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల అనంతరం హార్ముజ్‌ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఇంధన సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. గ్రీన్‌ ఆశా కంటే ముందు బిడబ్ల్యూ టైర్‌, బిడబ్ల్యూ ఎల్మ్‌ అనే రెండు ఎల్‌పిజి నౌకలు సుమారు 94,000 టన్నుల కార్గోను రవాణా చేశాయి. మార్చి నెలలో ఎంటి శివాలిక్‌, ఎంటి నందా దేవి అనే ట్యాంకర్లు 92,700 టన్నుల ఎల్‌పిజిని గుజరాత్‌లోని ముంద్రా, కాండ్లా పోర్టులకు చేర్చాయి. ముడి చమురు, ఇతర ఇంధన నౌకలు కూడా ఈ మార్గంలో ప్రయాణించాయి. 'జగ్‌ లాడ్కి' అనే ఆయిల్‌ ట్యాంకర్‌ యుఎఇ నుండి 80,000 టన్నుల ముడి చమురును ముంద్రా పోర్టుకు తీసుకురాగా, 'జగ్‌ ప్రకాశ్‌' నౌక ఒమన్‌ నుంచి ఆఫ్రికా మార్కెట్లకు గ్యాసోలిన్‌ను చేరవేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti