Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశిస్తే దాడులు తప్పవు : అమెరికాను హెచ్చరించిన ఇరాన్‌

హర్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశిస్తే దాడులు తప్పవు : అమెరికాను హెచ్చరించిన ఇరాన్‌

టెహ్రాన్‌ : హార్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించినా, లేదా సమీపించినా అమెరికా దళాలపై దాడలు చేస్తాం అని ఇరాన్‌ సైన్యం సోమవారం హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలకు మార్గనిర్దేశం చేసేందుకు 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' అనే పేరుతో ఒక నావికాదళ మిషన్‌ను కొన్ని గంటల్లోనే ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే హార్మూజ్‌ జలసంధిలోకి ప్రవేశించినా, లేదా దాన్ని సమీపంలోకి వచ్చినా సరే అమెరికా దళాలపై తాము దాడులు జరుపుతామని ఇరాన్‌ సైన్యం హెచ్చరించింది.

కాగా, మరోవైపు పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖా మంత్రి మొహమ్మద్‌ ఇషాక్‌ దార్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అబ్బాస్‌ అరాగ్చిలు సోమవారం ప్రాంతీయ పరిస్థితులపైనా, శాంతి నెలకొల్పడానికి దౌత్యపరమైన మార్గాలపైన ఫోన్‌లో సంభాషించుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti