ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా రాజాం ప్రాజెక్టులో నలుగురు హెల్పర్లకి రెండు సంవత్సరాలుగా ప్రమోషన్లు ఇవ్వకుండా ఆపారు. యూనియన్ పోరాట ఫలితంగా ఇద్దరు హెల్పర్లకి మే ఒకటో తేదీన ప్రమోషన్లు ఇచ్చారు.
కానీ వంగర మండలం కింజంగి - 1, సంతకవిటి మండలం మండా కురిటి - 3 అంగన్వాడి సెంటర్ లో పనిచేస్తున్న హెల్పర్లు కు అర్హత ఉన్న రెండు సంవత్సరాల నుండి వర్కర్లుగా ప్రమోషన్ ఇవ్వడం లేదు. వెంటనే ప్రమోషన్లు జీవో నెంబర్ 2 ప్రకారం ఇవ్వాలని సోమవారం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా పిడి కి మరియు ప్రాజెక్టు అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాజాం ప్రాజెక్ట్ ఆఫీస్ కి 6 - 11 - 25 వ తేదీన పిలిపించి ఆర్డర్ కాపీలు చేతికిచ్చి వెంటనే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పీఏ ఫోన్ చేశారు.
కావున మీ ప్రమోషన్లు నిలుపువేస్తామని చెప్పి ఇచ్చిన ఆర్డర్ కాపీలని వెనక్కి తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం.10 - 11 - 25 పతేదీనా గ్రీవెన్స్ లో కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన స్పందించి వెంటనే వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పారు. అయినా నేటికీ వీళ్ళిద్దరికీ ప్రమోషన్లు ఇవ్వడం లేదు.
కారణం రాజకీయ నాయకులకి ప్రమోషన్లకి ముడిపెడుతున్నారు. పోరాడి సాధించుకున్న ప్రమోషన్లు జీవోను కూడా అమలు చేయకపోవడం దుర్మార్గం. కావున వెంటనే వీళ్ళిద్దరికీ ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ స్పందించి పిడి ని వెంటనే పిలిపించారు. ఎందుకు ప్రమోషన్లు ఇవ్వలేదు . వారం రోజుల్లో వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని పిడి కి చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే సురేష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వి లక్ష్మి, రాజాం ప్రాజెక్టు కార్యదర్శి సిహెచ్ రూపవతి, ఇద్దరు హెల్పర్లు పాల్గొన్నారు.

