Thursday, 07 Nov, 4.05 pm ప్రజాశక్తి

తాజావార్తలు
హిందూపురంలో పట్టుగూళ్ల మార్కెట్‌ రైతుల నిరసన

* ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి : రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిబడా సుబ్బి రెడ్డి లు

అనంతపురం : పట్టు రైతుల సౌకర్యార్థం సిరికల్చర్‌ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిబడా సుబ్బి రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌ రైతులతో కలిసి రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిబడా సుబ్బి రెడ్డి లు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిబడా సుబ్బి రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, పట్టు రీలర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు గత సంవత్సర కాలం నుంచి విడుదల చేయలేదన్నారు. దీంతో పట్టు రీలర్లు గురువారం పట్టుగూళ్ల మార్కెట్‌ లో లావాదేవీలు నిలిపివేశారని, వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన రైతులు పట్టుగూళ్ల మార్కెట్‌ ముందు నిరసన చేపట్టారని తెలిపారు. రైతులకు ఇవ్వాల్సిన ప్రోత్సాహక నిధులు రూ. 5.70 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. మార్కెట్‌ తెలియక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు వెంటనే ప్రత్యామ్నాయం చూపించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సోదరులు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top