దుబాయి : భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆమె 762 పాయింట్లతో.. దక్షిణాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
4వ ర్యాంక్‌లోనే కోహ్లి..
టి20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తమ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కోహ్లి నాలుగు, కేఎల్ రాహుల్ ఆరు స్థానాల్లో నిలిచారు. మరోవైపు భారత బౌలర్లలో ఏ ఒక్కరూ టాప్-10లో లేకపోవడం గమనార్హం. బ్యాట్స్‌మెన్ జాబితాలో ఇంగ్లండ్ ప్లేయర్ డేవిడ్ మలన్ 841 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ 819 పాయింట్లతో రెండు, ఆస్ట్రేలియా ప్లేయర్ ఆరోన్ ఫించ్ 733 పాయింట్లతో మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ 717 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ డివాన్ కాన్వే 700 పాయింట్లతో ఐదు, కేఎల్ రాహుల్ 699 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. మరోవైపు బౌలింగ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ షాంసీ 775 పాయింట్లతో తొలి ర్యాంక్‌లో ఉండగా తర్వాతి స్థానాల్లో శ్రీలంక స్పిన్నర్ వానిండు హసరంగా 747, అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 719 పాయింట్లతో టాప్‌ా3లో ఉన్నారు. భువనేశ్వర్ కుమార్, వాషింగ్టన్ సుందర్ మాత్రం 12, 18 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

