Dailyhunt
ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కృష్ణతేజ, అశోక్‌ ప్రతిభ

ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ కృష్ణతేజ, అశోక్‌ ప్రతిభ

విజయవాడకు చెందిన లఘు చిత్రాల దర్శకుడు, నిర్మాత, నటులు పుచ్చ రొహిత ఫణి కృష్ణతేజ, దర్శకుడు అశోక్‌దార్లకు అరుదైన గౌరవం లభించింది. నేపాల్‌కు చెందిన స్పైనీ బబ్లర్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ సంస్థ 2025 సంవత్సరానికిగాను అంతర్జాతీయ స్థాయిలో 'రేడియో రివైన్‌' డాక్యు మెంటరీ ఉత్తమ జాబితాలో నిలించింది.

దీనికిగాను కృష్ణతేజకు బెస్ట్‌ డైరెక్టర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీలో అశోక్‌ దార్ల ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న కృష్ణతేజ, అశోక్‌లకు పలువురు లఘు చిత్ర, సినీరంగ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 2022లో కృష్ణతేజ నటించి దర్శకత్వం వహించిన 'మనోరంజన్‌' లఘు చిత్రానికి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. 2024 సంవత్సరానికిగాను 'మనోరంజన్‌', 'సత్యమేవజయతే' వంటి షార్ట్‌ఫిలిమ్స్‌ నేపాల్‌ ఫెస్టివల్స్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 100కుపైగా అవార్డులను పొందిన సందర్భాన్ని గుర్తించి 2023లో తెలంగాణా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ సంస్థ కృష్ణతేజకు ధృవీకరణ కూడా అందజేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti