Dailyhunt
ఇరాన్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృతి

ఇరాన్‌లో భారీ అగ్నిప్రమాదం - 8 మంది మృతి

- 36 మందికి గాయాలు

టెహ్రాన్ : టెహ్రాన్ సమీపంలో ఉన్న ఒక షాపింగ్ మాల్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, 36 మంది గాయపడినట్లు ప్రభుత్వ టీవీ వెల్లడించింది.

టెహ్రాన్ ప్రావిన్స్‌లోని అండిషే పట్టణంలో ఉన్న అర్ఘవాన్ షాపింగ్ సెంటర్ లో మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఐఆర్ఐబి తెలిపింది. బహుళ అంతస్తుల భవనం నుంచి నల్లటి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు చేసిన ప్రయత్నాలు వీడియోల్లో కనిపించాయి. భవనం క్లాడింగ్ మండే స్వభావం కలిగి ఉండటం వల్ల మంటలు వేగంగా వ్యాపించినట్లు స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపిందని మిజాన్ న్యూస్ ఏజెన్సీవెల్లడించింది. గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది చివరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనకు అమెరికాతో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు సంబంధం ఉందా అన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti