Dailyhunt
ఇరాన్‌పై సంపూర్ణ విజయం : ట్రంప్

ఇరాన్‌పై సంపూర్ణ విజయం : ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్ యుద్ధంలో అమెరికా లక్ష్యాలు నెరవేరాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా సంపూర్ణ విజయం సాధించిందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే వారాల్లో ఇరాన్‌పై దాడిని తీవ్రతరం చేస్తామని, యుద్ధంలో ఆ దేశం నాశనమైందని ట్రంప్ అన్నారు. ఇరాన్ క్షిపణి నిల్వలు, నౌకాదళ, వాయుసేనలను ధ్వంసం చేశామని ట్రంప్ మీడియాకు తెలిపారు. ఇరాన్‌లో లక్ష్యాన్ని చేరుకున్నందుకు ఇప్పుడు సంబరాలు జరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. ఇరాన్‌పై సైనిక చర్యలో పాల్గొన్న అమెరికా సైనికులను ట్రంప్ అభినందించారు. వెనిజులాలో ఆపరేషన్ నిర్వహించిన సైనికులను కూడా ట్రంప్ అభినందించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti