రాయదుర్గం: రాయదుర్గం పట్టణంలోని కోటలో గల జంబుకేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రథోత్సవం జరిగింది. కోటలోని ఆలయం నుండి వినాయక కూడలి వరకు స్వామివారి ఉత్సవమూర్తులను ఉంచి మడుగు తేరు లాగారు.
అక్కడ నుండి పట్టణ ప్రధాన వీధులలో రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి అధ్యక్షులు రేకలకుంట సత్యనారాయణ, దేవదాయ శాఖ కార్య నిర్వహణ అధికారి నరసింహారెడ్డి, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

