Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జమ్మూలో వంతెన కూలి ముగ్గురు మృతి

జమ్మూలో వంతెన కూలి ముగ్గురు మృతి

మ్మూ : శుక్రవారం బంటాలాబ్‌లోని థుథర్ ప్రాంతంలో జమ్మూ శివార్లలో ఉన్న వంతెనలో కొంత భాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో శిథిలాల కింద ఉన్న మూడు మృతేహాలను, గాయపడిన వ్యక్తులను రెస్య్కూ సిబ్బంది 12 గంటలు శ్రమించి వెలికితీశారని శనివారం అధికారులు వెల్లడించారు.

కాగా, శుక్రవారం అర్థర్రాతి ఈ ఘటన జరిగింది. వెంటనే ఉపముఖ్యమంత్రి సురీందర్‌ కుమార్‌ చౌదరి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పర్యవేక్షించారు. వెంటనే ఈ వంతెన నిర్మించిన ఇద్దరు ఇంజనీర్లను ఆయన సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేసింది. విచారణను ఐదురోజుల్లోనే పూర్తి చేయాలని డిప్యూటీ సిఎం అధికారులను ఆదేశించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు, అగ్నిమాపక, అత్యవసర విభాగాలు వెంటనే సహాయక చర్యలను ప్రారంభించాయి. రెస్క్యూ బృందాలు ఈ ప్రమాదంలో గాయపడిన తర్సీమ్‌ లాల్‌ అనే ఓ కార్మికుడిని బయటకు తీశారు అని అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయానికి రెస్య్యూ ఆపరేషన్స్‌ ముగిశాయి. ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరు గాయపడిన వ్యక్తుల్ని కూడా వెలికితీసినట్లు సీనియర్‌ అధికారి మీడియాకు వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti