చెన్నై : పెంపుడు జంతువులను కొంతమంది చంటిపిల్లలుగా చూసుకుంటూ.. వాటికి సపర్యలన్నీ చేస్తుంటారు. అంతలా చూసుకునే పెంపుడు జంతువులకు ఏ కష్టమొచ్చినా వారు విలవిల్లాడిపోతారు. సరిగ్గా అలాంటి కోవకు చెందిన వ్యక్తే తమిళనాడుకు చెందిన సైమన్. ఆయన కుక్కల్ని, గొర్రెల్ని, ఆవుల్ని, కుందేళ్లని ఇష్టంగా పెంచుకుంటారు. తనకెంతో ఇష్టమైన ఓ గొర్రెపిల్లకు వెనుక కాళ్లపై నుంచి బైక్ వెళ్లడంతో.. దాని నరాలు చచ్చుబడిపోయాయి. వైద్యుల్ని సంప్రదించినా.. లాభం లేకపోయింది. డాక్టర్లు కూడా ఇక ఆ గొర్రెపిల్లకు కాలు రావడం సాధ్యం కాదని చెప్పారు. గొర్రెపిల్ల నడవలేక ఇబ్బందిపడుతుంటే సైమన్ దాన్ని చూసి తల్లడిల్లిపోయి... దానికోసం వెయ్యిరూపాయలు వెచ్చించి చక్రాలబండిని తయారుచేశాడు.

