Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి

కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బంది అందరిని పర్మినెంట్ చేయాలి

ప్రజాశక్తి - నరసాపురం

పట్టణంలోని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి లో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కాంట్రాక్ట్ మెడికల్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ లు, ఐసిటిసి సెంటర్ సిబ్బంది మాట్లాడుతూ కాంట్రాక్ట్ సిబ్బంది 15 సంవత్సరాల నుండి పని చేస్తూన్నారు. కానీ ఇప్పటి వరకు వారి ఉద్యోగాలు పర్మినెంట్ అవ్వలేదని ఉద్యోగుల నియమక ప్రక్రియ మొత్తం కూడా నోటిఫికేషన్ ద్వారా వ్రాతపూర్వక పరీక్షలు వ్రాసి మరియు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి పూర్తి అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గత 15 సంవత్సరాల నుండి కాంటాక్ట్ పద్దతిలో పని చేస్తున్నామని ప్రభుత్వం వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని పర్మినెంట్ చేయాలని కోరుతూ నిరసన తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి స్టాఫ్ నర్స్ లు, ఐసిటిసి సెంటర్ సిబ్బంది, ఫార్మసిస్ట్ సిబ్బంది, జనరల్ లాబ్ సిబ్బంది, ఆర్‌.ఎన్‌.టి.సి.పి సిబ్బంది, డి ఎడిక్షన్ సెంటర్ సిబ్బంది డి.ఇ.ఒ సిబ్బంది, ఎలెక్ట్రీషియన్ సిబ్బంది, దోబి, సెక్యూరిటి గార్డ్ సిబ్బంది, శానీటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti