* ఫలితాన్నివ్వని 370 రద్దు
* ఇప్పటివరకు 88 ఘటనలు
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలన కోసమే జమ్ము కాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370 రద్దు చేసామని చెప్తున్న మోడీ సర్కార్ మాటలు నిజం కాదని కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన లెక్కలే చెబుతున్నాయి. 370 రద్దు తరువాత పెద్దఎత్తున బలగాలను దించి పూర్థిస్థాయిలో ఆంక్షలు అమలు చేసినప్పకీ కాశ్మీర్‌లో ఉగ్రవాద ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉందని ఈ గణంకాలు తెలుపు తున్నాయి. ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుండి 88 ఉగ్రవాద సంఘటనలు నమోదయ్యాయని హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పార్లమెంట్‌లో వెల్లడించింది. జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన నాటి నుండి రాష్ట్రంలో అంతకుముందెన్నడూ లేని విధంగా భద్రతా ఆంక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే.

