Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

ముంబై: మహారాష్ట్ర పూణెలో తీవ్ర విషాదం నెలకొంది. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన పూణే జిల్లాలో జరిగింది.

గత రెండు రోజులుగా పూణె, పింప్రి-చించ్వాడ్‌లలో కల్తీ మద్యం సేవించడం వల్ల 12 మంది మృతి చెందారు. పింప్రి-చించ్వాడ్‌లోని ఫుగెవాడి ప్రాంతంలో ఏడుగురు, హడప్సర్‌ చెందిన ఐదుగురు మృతి చెందారు. హడప్సర్‌లో మరణించిన వారిలో రాహుల్ శరద్ క్షీరసాగర్, విజయ్ భూకుర్‌లాల్ శర్మ, అరుణ్ దాదర్, అశోక్ రమేష్ చవాన్‌లుగా పోలీసులు గుర్తించారు. ఫుగేవాడిలో మరణించిన వారిలో రాజేష్ రాజ్‌పుత్, పాండురంగ్ ఫుగే, ఆనంద్ దేశాయ్, అక్బర్ పఠాన్, ఆనంద్ నికల్జే తదితరులు ఉన్నారు. ఈ ఘటనలో ఫుగేవాడిలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ఈ విషాదంలో మరణించారని అధికారులు తెలిపారు. అనారోగ్యానికి గురైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని పూణే, పింప్రి-చించ్వాడ్ పోలీస్ కమిషనర్లను ఆయన ఆదేశించారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కల్తీ మద్యం నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారని, దీంతో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశమున్నదని ఆయన వివరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti