Dailyhunt
కరోనా ఎఫెక్ట్ : విజయనగరంలో కరోనా పై ప్రజలకు అవగాహన

కరోనా ఎఫెక్ట్ : విజయనగరంలో కరోనా పై ప్రజలకు అవగాహన

విజయనగరం : నేచర్‌ సంస్థ సిబ్బంది ఆధ్వర్యంలో కరోనా వైరస్‌ నివారణపై విజయనగరంలో జనసంచారం ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాల్లో శనివారం అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. 'ముందుగా జాగ్రత్తలు పాటిద్దాం.. కరోనా వైరస్‌ను అరికడదాం..' అంటూ.. ఆర్‌టిసి కాంప్లెక్స్‌ మహరాజా హాస్పిటల్‌, రైల్వే స్టేషన్‌ ఏరియాలలో అందరికీ అవగాహన కల్పించారు. విదేశాల నుండి ఎవరైనా వచ్చి ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. 104 కి కాని, కాల్‌ సెంటర్‌ 0866 - 2410978 కు ఫోన్‌ చేయాలని చెప్పారు. వైరస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నిటినీ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ పోలీసులు, త్రినాథ్‌ రావు, ఆటో యూనియన్‌, హరి నారాయణ, నేచర్‌ సంస్థ సిబ్బంది, జికె.దుర్గ, జిఎస్‌వి కృష్ణ, జిఎస్‌.సతీష్‌ కుమార్‌, సిహెచ్‌.అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti