ప్రజాశక్తి-ఉలవపాడు : కరోనా కట్టడి అందరి బాధ్యత అని ఎమ్మెల్యే మాగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. కరోనా కట్టడిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మండల టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా ఉధృతంగా విజృంభిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ తేళ్ళ రవికుమార్, తహశీల్దారు కె.సంజీవరావు, ఇఒపిఆర్‌డి ఎల్.చెంచమ్మ, ఎస్‌ఐ విశ్వనాధరెడ్డి, వైసిపి రాష్ట్ర ప్రచార కార్యదర్శి రామాల శింగారెడ్డి పాల్గొన్నారు.టంగుటూరు : కరోనా కట్టడిపై సర్పంచులు, వార్డు మెంబర్లకు ఎంపిడిఒ అజిత అధ్యక్షతన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్, వైసిపి కొండపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ మాదాసి వెంకయ్య మండలంలో 40వేలు జనాభా ఉండగా కేవలం 3,700 మందికి మాత్రమే వ్యాక్సిన్ వేయడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎ.బాలకిషోర్, వైద్యాధికారి డాక్టర్ ఎస్.ప్రసాద్ బాబు, ఎస్‌ఐ ఎస్‌కె. నాయబ్‌రసూల్, వైసిపి మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు, సర్పంచలు పాల్గొ న్నారు. మండల టాస్క్‌ఫోర్స్ కమిటీతో పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యులు పి.అజిత, ఎ.బాలకిషోర్, డాక్టర్ ఎస్.ప్రసాద్‌బాబు, వైసిపి మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిరావు, పంచాయతీ కార్యదర్శి ఎన్.జగదీష్‌బాబు పాల్గొన్నారు. కొండపి : కరోనా కట్టడిపై టాస్క్‌ఫోర్స్ కమిటీ ఆధ్వర్యంలో దుకాణదారులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో తహశీల్దారు కామేశ్వరరావు, ఎస్‌ఐ వి. రాంబాబు, ఎంపిడిఒ శ్రీనివాసరావు, పెట్లూరు ప్రభుత్వ వైద్యాధికారి సునీల్ గవాస్కర్, ఇఒఆర్‌డి విజయలక్ష్మి పాల్గొన్నారు. గుడ్లూరు : కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు శ్రీశిల్ప, ఎంపిడిఒ ఎం. వెంకటేశ్వర్లు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.యద్దనపూడి : కరోనా కట్టడిపై గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ లక్ష్మిదేవి, ఇఒఆర్‌డి శ్రీనివాసరావు, ఎపిఎం మధు పాల్గొన్నారు.వెలిగండ్ల : కరోనా కట్టడిపై సర్పంచులకు, వార్డు మెంబర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ తాతపూడి సుకుమార్, ఎంఇఒ ప్రసాద్, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు. దర్శి : కరోనా కట్టడిపై సర్పంచులకు, వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ శోభన్‌బాబు, ఎంఇఒ కె. రఘురామయ్య పాల్గొన్నారు. ముండ్లమూరు : కరోనా కట్టడిపై సర్పంచులు, వార్డు మెంబర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, ఎపిఎం బాబూరావు పాల్గొన్నారు. శింగరాయకొండ : కరోనా కట్టడిపై టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు ఎస్.ఉషారాణి, ఇన్‌ఛార్జి ఎంపిడిఒ జివి.కృష్ణారావు, ఇఒఆర్‌డి అంజలీదేవి, ఎస్‌ఐ ఎల్.సంపత్‌కుమార్, డాక్టర్ కె.కోటేశ్వరరావు, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ పార్వతిబాయి పాల్గొన్నారు. కనిగిరి : కరోనా కట్టడిపై ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌యాదవ్ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ , తహ శీల్దారు పుల్లారావు, ఎంపిడిఒ మల్లికార్జునరావు, మున్సిపల్ కమీషనర్ నారాయణరావు, డాక్టర్ నాగరాజ్యలక్ష్మి పాల్గొన్నారు. వలేటివారిపాలెం : కరోనా కట్టడిపై సర్పంచులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో bంపిడిఒ షేక్ రఫీక్ అహ్మద్, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పొదిలి : కరోనా కట్టడిపై టాస్క్‌ఫోర్స్ కమిటీతో మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెవెన్యూ పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో కరోనా నివారణకు తగిన ప్రణాళిక అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు హనుమంతరావు, సిఐ శ్రీరామ్, నగర పంచాయతీ కమీషనర్ భవానీ ప్రసాద్, కంభం ఎంఎసి చైర్మన్ వై వెంకటేశ్వరరావు, సానికొమ్ము శ్రీనివాసుల రెడ్డి, వెంకట రమణారెడ్డి, జి. చెన్నారెడ్డి, కె. సుబ్బారెడ్డి పాల్గొన్నారు. చీమకుర్తి : కరోనా కట్టడిపై సర్పంచులు, వార్డు సభ్యులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ వండర్‌మెన్, వెంకటేష్, గోనుగుంట ప్రధానోపాధ్యాయులు పి.శ్రీనివాస రావు, పిఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు.

