Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనా నిబంధనలు తప్పక పాటించాలి: సిఐ

కరోనా నిబంధనలు తప్పక పాటించాలి: సిఐ

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కర్ఫ్యూ నిబంధనలను తప్పక పాటించాలని యర్రగొండపాలెం సిఐ దేవప్రభాకర్‌ అన్నారు. దోర్నాల పట్టణంలో ఆయన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ తప్పని పరిస్థితుల్లోనే బయటకు రావాలన్నారు. బయటకు వచ్చిన సమయంలో శానిటైజర్లు, మాస్క్‌లు ఉపయోగించాలని సూచించారు. ఆయన వెంట ఎఎస్‌ఐ బ్రహ్మయ్య, పోలీసు సిబ్బంది సురేష్‌ పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti