Dailyhunt
కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది : మంత్రి మోపిదేవి

కరోనాతో ప్రపంచం అతలాకుతలమవుతోంది : మంత్రి మోపిదేవి

అమరావతి : కరోనా వైరస్‌తో ప్రపంచం అతలాకుతలమవుతోందని మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వల్ల ఆక్వా, పౌల్ట్రీరంగాలు ఇబ్బంది పడుతున్నాయని, ఆక్వా రంగానికి వచ్చే మూడునెలలు చాలా కీలకమన్నారు. కరోనాతో సంబంధంలేకుండా ఆక్వా ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కనీస మద్దతు ధరల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లలో హెల్త్‌ ప్రొటోకాల్‌ పాటించేలా చర్యలు తీసుకుంటామని, ఎగుమతులపై ఇతర దేశాలతో సంప్రదించాలని కేంద్రాన్ని కోరామని మోపిదేవి తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti