Dailyhunt
కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన నల్లారి సోదరులు

కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన నల్లారి సోదరులు

ప్రజాశక్తి-కలికిరి (అన్నమయ్య) : కలికిరి జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో బుధవారం కలికిరి ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది.

ఈ టోర్నమెంట్‌ను మాజీ ముఖ్యమంత్రి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వారికి పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. ఇరువురు కలిసి జెండా ఊపి క్రికెట్ టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ….

యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని, గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కేపీఎల్ వేదికగా నిలుస్తుందని, క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుందని అన్నారు. అనంతరం నల్లారి సోదరులు ఇరువురు బ్యాట్ పట్టి బంతిని ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఈ టోర్నమెంట్‌లో పలు జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాగర్ బ్యాంకు చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి, ఆయుర్వేద డాక్టర్ సి. మహేంద్ర, కార్య నిర్వాహకులు, కూటమి నాయకులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti