కొనసాగుతున్న సంపూర్ణ లాక్ డౌన్
ప్రజాశక్తి -మొవ్వ
మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా దష్ట్యా ప్రజా శ్రేయస్సు కోసం మండల టాస్క్ఫోర్స్ కమిటీ విధించిన సంపూర్ణ లాక్ డౌన్ ఆది, సోమవారాల్లో కొనసాగుతోంది. వర్తక, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవలను మాత్రమే అనుమతిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే మండలంలోని ప్రధాన వ్యాపార కూడలి కూచిపూడి సెంటర్ జన సంచారం లేక వెలవెల బోయింది. సామాన్య జీవనానికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ విజంభిస్తున్న కరోనాను కట్టడి చేయాలంటే లాక్ డౌన్ తప్పదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జనసంచారం తగ్గించేందుకు కూచిపూడి పోలీస్, సచివాలయం మహిళా పోలీసులు ఆయా గ్రామాల్లో కర్ఫ్యూ అమలులో నిమగమయ్యారు.

