Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొత్త జాబ్ క్యాలండర్ కోసం అర్ధ గుండుతో నిరసన

కొత్త జాబ్ క్యాలండర్ కోసం అర్ధ గుండుతో నిరసన

అనంతపురం :

జాబ్ క్యాలెండర్ లో ఖాళీలన్నీ కలిపి కొత్త క్యాలండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ విగ్రహం ఎదుట అర్ధ గుండుతో యువకులు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలండర్ లో టీచర్ పోస్టులు 25వేలు, కానిస్టేబుల్ పోస్టులు 16వేలు, లైబ్రరీ సైన్సు 6వేల పోస్టులు, సచివాలయంలో 8వేలు ఖాళీగా ఉన్న వీటిని ఈ క్యాలండర్ లో పేర్కోనకపోవడంపై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీటిని కూడా కలిపి జాబ్ క్యాలండర్ ప్రకటించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం ప్రకటించిన క్యాలండర్ లో గ్రూప్ 1,2కలిపి కేవలం 36పోస్టలే పేర్కొన్నారు.

వేలల్లో ఖాళీగా ఉన్న వాటని పేర్కొనలేదు. గ్రూప్ 3,4 పోస్టులు ప్రస్తావన అసలే లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన మొదట అసెంబ్లీ సమావేశంలో ఈ రాష్ట్రంలో 1.83లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. ఆ పోస్టులు ఈ క్యాలండర్ కలిపి ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు.

ఈ రెండున్నర ఏళ్లలో కేవలం సచివాలయ పోస్టులు మరియు వాలంటీర్లు మాత్రమే నియమించారు. కోవిడ్ సమయంలో మాత్రమే వైద్య రంగంలో తాత్కాలిక నియామకాలు జరిపింది మినహా యితర నియామకాలు ఈ రెండేండ్ల లో జరపలేదు. కానీ ఈ రోజు ప్రకటనలో APSRTC కార్పోరేషన్ లో ఉన్న వారిని ప్రభుత్వంలో విలీనం చేసి వారందరినీ కొత్తగా నియమించినట్టు చూపించారు. కొత్తగా నియామకాలు జరగలేదు.

ఇప్పటికే పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను అప్కాస్ అనే సంస్థను ఏర్పాటు చేసి అందులో నమోదు చేయించారు తప్ప, కొత్తగా ఉద్యోగాల్లోనికి ఎవరిని తీసుకోలేదు. ఇలా ఇప్పటికే ఉన్న ఉద్యోగులను మళ్లీ నియమించినట్టు చూపించారు. ఈ విధంగా కాకుండా నోటిఫికేషన్ ఇచ్చి నియమించిన పోస్టులను మాత్రమే పేర్కోంటే బాగుండేది. అలాగే నిరుద్యోగులు ఎదురుచూస్తున్న టీచర్, కానిస్టేబుల్, సచివాలయం, లైబ్రరీ సైన్సు పోస్టులు గ్రూపు 1,2,3,4 పోస్టులు సంఖ్య పెంచి క్యాలండర్ కొత్తగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో SFI నాయకులు అచ్యుత ప్రసాద్, నరేంద్ర, సంజీవ్, అష్రాఫ్, aiyf నాయకులు రాకెట్ల రాము, జిల్లా నాయకులు విజయ్ రెడ్డి, వినయ్, AISF నాయకులు నరసింహ యాదవ్, రాఘవ, బాలు, నారాయణ స్వామి, ముని స్వామి, వీరేష్ తదితరులు పాల్గొన్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti