Friday, 18 Oct, 11.17 pm ప్రజాశక్తి

తాజావార్తలు
కొత్త రైలు కావాలి

ప్రస్తుతం దేశంలో ఎన్నో కొత్త రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే దశాబ్ద కాలంగా వేలాదిమంది రైలు ప్రయాణీకులు ఎదురుచూస్తున్న కాకినాడ పోర్ట్‌-పిఠాపురం రైల్వే మెయిన్‌ లైన్‌ అనుసంధానం చేయడం లేదు. కాకినాడ ఓడరేవు ద్వారా రికార్డు స్థాయిలో రైల్వే శాఖకు చెప్పుకో తగ్గ లాభాలు వస్తున్నాయి. ఈ రైల్వే ప్రాజెక్టును రీ సర్వే చేయాలని, వెంటనే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి, జాతికి అంకితం చేయాలని లక్షలాది మంది ప్రయాణీకులు ఎదురుచూస్తున్నారు. అంతవరకు దీనికి ప్రత్యామ్నాయంగా కాకినాడ పోర్ట్‌, హౌరా, వయా, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, బెరహంపూర్‌ మీదుగా హౌరాకు ఎగువ దిగువన వీక్లీ రైళ్లు నడపాలి.

- జె ఎస్‌, పిఠాపురం.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top