Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కోవిడ్‌ అసుపత్రికి 'బాలయ్య' సాయం

కోవిడ్‌ అసుపత్రికి 'బాలయ్య' సాయం

హిందూపురం : ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం హిందూపురం కోవిడ్‌ ఆసుపత్రికి రూ.15 లక్షలు విలువజేసే కోవిడ్‌ మందులను అందించారు. ఆర్‌అండ్‌బి అథితి గృహంలో టిడిపి నాయకులు మెడికల్‌ సుపరిడెంటెండ్‌ దివాకర్‌కు వీటిని అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ గతేడాది కరోనా విపత్కర సమయంలో కోట్లాది రూపాయాలు వెచ్చించి అసుపత్రికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించారన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో బాలకృష్ణ హైదరాబాద్‌లో ఉన్నప్పటకీ అక్కడి నుంచి విలువైన మందులను పంపించారని చెప్పారు. హైదరాబాద్‌ బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇస్టిట్యూట్‌, ఎన్‌బికె సేవా సమితి సౌజన్యంతో ప్రత్యేకంగా వచ్చిన వాహనంలో మందులను హిందూపురానికి తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఒక్కో కిట్‌ రూ.1000 విలువజేసే 1500 కిట్లను ఆసుపత్రికి ఇచ్చారన్నారు. ఇందులో 1000 ప్రస్తుతం ఇచ్చి మరో 500 కిట్లు సోమవారం అసుపత్రికి ఇవ్వనున్నట్లు చెప్పారు. మరో 1500 కిట్లు బాలకృష్ణ ఇంటి వద్ద సిద్ధంగా ఉంచుతామని తెలిపారు. హోమ్‌ ఐసులేషన్‌లో ఉండే వారు వీటిని పొందవచ్చ అన్నారు. బాలకృష్ణ ఎక్కడున్నా నిరంతరం పురం ప్రజల ఆరోగ్యం కోసం తపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా, మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ అనిల్‌ కుమార్‌, నాగరాజు, పట్టణ అధ్యక్షులు రమేష్‌ కుమార్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ రాము, ఆదినారాయణ, తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కర్‌, శివకుమార్‌, బీసీ సెల్‌ అధ్యక్షులు దుర్గా నవీన్‌, విజయలక్ష్మి, మాజీ సర్పంచి రాము, నాగేంద్ర, హరీష్‌, అల్లాబకాష్‌, నూరుల్లా, బాషా పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti