Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్షుద్ర పూజల పేరుతో మోసం.. మహిళ హత్య

క్షుద్ర పూజల పేరుతో మోసం.. మహిళ హత్య

ప్రజాశక్తి - అర్ధవీడు (మార్కాపురం జిల్లా) : క్షుద్ర పూజల ద్వారా బంగారం, డబ్బులు తెప్పిస్తానని నమ్మించి భారీ మొత్తంలో నగదు తీసుకున్న ఓ మహిళ.. చివరకు తన ఆడపడుచును హత్య చేసిన ఘటన అర్ధవీడు మండలంలోని వీరభద్రపురం గ్రామంలో వెలుగుచూసింది.

పెద్దారవీడు మండలం పగళ్లపాడు గ్రామానికి చెందిన మూడమంచు ఆదిలక్ష్మి (29)కి భర్త బాలగురవయ్య, నలుగురు మగపిల్లలున్నారు. ఆమె బంధువైన గుమ్మ రాజమ్మ... క్షుద్ర పూజల ద్వారా బంగారం, డబ్బులు లభిస్తాయని ఆశ చూపి ఈ క్రమంలో ఆదిలక్ష్మి నుంచి సుమారు యాభై లక్షల వరకూ డబ్బులు తీసుకుంది. మరొక వ్యక్తి జంగాల రవి నుంచి రూ.40 లక్షల వరకూ డబ్బులు తీసుకుంది. తమకేమీ బంగారం, డబ్బు రాకపోవడంతో తన రూ.50 లక్షలు ఇవ్వాలని ఆదిలక్ష్మి రాజమ్మపై ఒత్తిడి చేసింది. ఆదిలక్ష్మిని అంతమొందించాలని రాజమ్మ ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో జూన్ 24న ఆదిలక్ష్మిని వీరభద్రపురం గ్రామానికి పిలిపించింది. ఇంట్లోనే హత్య చేసి.. మృతదేహాన్ని ఎర్రకొండ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. తన భార్య కనిపించడం లేదని భర్త బాలగురవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేయగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti