పట్టించుకోని ప్రజాప్రతినిధులు ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం సింగరాయ గ్రామంకు చెందిన ప్రధాని రహదారికి నిర్మించిన వంతెన పూర్తిగా శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నది.
సింగరాయి గ్రామము కోమటి చెరువు నుండి ఊర చెరువుల మధ్య ఇరు గ్రామాల మధ్య ప్రజలు రాకపోకలకు ఆటంకం కలగకుండా వంతెన నిర్మాణం జరిగినది. రైతులు పండించే పంటతో పాటు పొలాలకు కల్లాలకు ఈ వంతెన మీదుగానే వెళ్లాలి. ఈ వంతెన ప్రస్తుతం పూర్తిగా శిథిలాస్తుగా చేరింది. రానున్నది వర్షాకాలం.
రెండు చెరువులు పొంగి ప్రవహిస్తాయి. ఆ సమయంలో ఈ బ్రిడ్జిపై రాకపోకలు సాగించడం కష్టతరం అవుతుంది. ఏ మాత్రం అశ్రద్ధ వహించిన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఒకవైపు పూర్తిగా పైపులు రక్షణ కొరకు ఏర్పాటు చేసినవి పాడైపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా ఇదే మార్గంలో వెళ్లాలి. అధికారులు స్పందించి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి సింగరాయ గ్రామ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగిస్తారని ప్రత్యేక అధికారులను కోరుతున్నారు.

