చెన్నై : కన్నతల్లే.. కుమారుడికి దెయ్యం పట్టిందని.. అతి కిరాతకంగా కొట్టి చంపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నామల్లై జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...ఏడేళ్ల తన కుమారుడికి గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో.. తల్లి ఓ స్వామిజీని కలిసింది. ఆ స్వామిజీ..తన కుమారుడికి దెయ్యం పట్టిందని చెప్పాడు. కుమారుడికి పట్టిన దెయ్యం వదిలించడానికి మూడురోజులుగా తల్లితోపాటు.. మరో ముగ్గురు మహిళలు కలిసి ఆ బాలుడిని కొడుతూనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. పోలీసులకు సమాచారమందిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే.. తల్లి పెట్టిన చిత్రహింసలకు తాళలేక బాలుడు మృతి చెందాడు.

