Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్యూబా జోలికి వెళ్లొద్దు : అమెరికాలో నిరసనలు

క్యూబా జోలికి వెళ్లొద్దు : అమెరికాలో నిరసనలు

న్యూయార్క్‌ : క్యూబాపై దాడి చేస్తామని అమెరికా పదేపదే చెబుతోంది. కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఇతర దేశాల నుంచి క్యూబాకు వెళ్లే ఇంధన సరఫరాల్ని అడ్డుకోవడమే కాకుండా..

ప్రత్యక్ష సైనిక జోక్యం చేసుకుంటామని అమెరికా బెదిరింపులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా 'హ్యాండ్స్‌ ఆఫ్‌ క్యూబా : క్యూబా జోలికి రావద్దు' అనే క్యాంపెయిన్‌ కూడా ఉధృతంగానే సాగుతోంది. ఇప్పటికే పలు దేశాలు క్యూబాకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాయి. క్యూబాను ఇంతగా బెదిరిస్తున్న అమెరికాలో కూడా తాజాగా నిరసనలు జరగడం గమనార్హం. ఆదివారం న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హాటన్ వీధుల్లో సామాజిక సంస్థలు, నివాసితులు నిరసన తెలిపారు. భారీ ట్రాఫిక్‌ ఉండే ప్రధాన కూడళ్ల వద్ద వృద్ధులు, యూత్‌ వందలాది క్యూబాకు సంఘీభావంగా నిరసన చేపట్టారు. 'యు.ఎస్‌ హ్యాండ్స్‌ అఫ్‌ క్యూబా' (క్యూబా విషయంలో అమెరికా జోక్యం చేసుకోకూడదు' అని రాసిన ప్లకార్డులను పట్టుకుని నిరసన తెలిపారు. అలాగే క్యూబా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న శతృత్వ వైఖరిని వీడనాడాలని నిరసనకారులు డిమాండ్‌ చేశారు. ఆ ద్వీపంపై దాడి చేయడానికి వాషింగ్టన్‌కు ఎటువంటి సమర్థన లేదని వారు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.

కాగా, ఈ నిరసనల్లో పాల్గొన్న సోషలిస్టు పార్టీ కార్యకర్త విల్లీకాటన్‌ మాట్లాడుతూ..' క్యూబాపై అమెరికా ప్రభుత్వ దాడులు తీవ్రమవుతున్నందున, అమెరికాలోని కార్మికులు, పోరాట యోధులు క్యూబాకు సంఘీభావం తెలపడం, దాని భవిష్యత్తును అదే నిర్ణయించుకునే హక్కును బలపరచడం అత్యవసరం' అని పేర్కొన్నారు.

న్యూయార్క్‌- న్యూజెర్సీ క్యూబా సి కూటమి (క్యూబా సంఘీభావాన్ని సమీకరించేది) నిర్వాహకురాలు టారిస్సే (టీ) ఇరియార్టే క్యూబాకు అమెరికా పాల్పడుతున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు. దశాబ్దాలుగా క్యూబా ప్రజల పట్ల అమెరికా ప్రభుత్వం చేస్తున్న దానికి జవాబుదారీగా ఉండాలని ఆమె నొక్కిచెప్పారు. అలాగే వాషింగ్టన్ ఏకపక్ష నిర్బంధ చర్యలను కఠినతరం చేస్తోందని, విఫలమైన విధానాలను మరింత బలోపేతం చేస్తోందని ఆరోపిస్తూ అమెరికా చర్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.

జాతీయ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులు, కమ్యూనిటీ గ్రూప్స్‌ కూటమి అయిన న్యూయార్క్‌- న్యూజెర్సీ క్యూబా సి కూటమి "క్యూబాపై యుద్ధం వద్దు" అనే దేశవ్యాప్త ప్రచారంలో భాగంగా ఆదివారం కూడా న్యూయార్క్‌లో చేపట్టిన నిరసన ట్రంప్‌ ప్రభుత్వానికి గట్టి సందేశమిచ్చింది.

ఫ్లోరిడాలోని మియామి అంతర్జాతీయ విమాన్రాశయం వద్ద కూడా క్యూబాకు సంఘీభావం తెలుపుతూ నిరసన చేశారు. అయితే క్యూబా వ్యతిరేకశక్తుల బృందం విమానాశ్రయంలోకి చొచ్చుకొళ్లేందుకు ప్రయత్నించగా.. నిరసనకారులు అడ్డుకున్నారు. 'క్యూబాకు శాంతి కావాలి, క్యూబాకు చమురు దిగ్బంధనం వద్దు, క్యూబా ఎస్‌ - దిగ్బంధనం నో' అని రాసిన ప్లకార్డులను పట్టుకుని వారు నిరసన తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti