తాజా వార్తలు
''లంగ్ పాయింట్'' టెక్నాలజీపై సదస్సు

- ప్రాధమిక దశలో గుర్తిస్తే నయం చేయోచ్చు
- యశోదా గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జి.ఎస్ రావు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
''లంగ్ క్యాన్సర్''ను ముందుగా గుర్తించే ''వర్చువల్ బ్రాంకొ స్కోపిక్ నావిగేషన్ సిస్టమ్''పై యశోద హాస్పిటల్స్ ఆద్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో తొలిసారిగా అంతర్జాతీయ సదస్సు జరిగింది. అంతర్జాతీయ శిక్షణ, లైవ్ వర్క్ షాప్ను యశోదా గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జి.ఎస్ రావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...శిక్షణా కార్యక్రమంలో పల్మనాలజిస్టులు వినూత్న చికిత్సా ప్రక్రియ అయిన లంగ్ పాయింట్ గూర్చి సమగ్రంగా తెలుసుకోవటమే కాకుండా లంగ్ క్యాన్సర్ చికిత్సలో అధునాతన చికిత్సా విదానాలు అమలుచేయటంలో అనుభవం పొందుతారు.'' అని తెలిపారు.
లమన దేశంలో మరణాలకు కారణమవుతున్నకాన్సర్లలో ఊపిరితిత్తుల కాన్సర్ రెండో స్థానంలో ఉందన్నారు. దేశంలో ఏటా నమోదయ్యే కాన్సర్ కేసులలో 8 శాతం కేసులకు, కాన్సర్ మరణాలలో 10 శాతానికి పైగా కారణమవుతున్నది ఊపిరితిత్తుల కాన్సర్లే. దేశ జనాభాలోని ప్రతీ లక్షమందిలో సుమారు 30-40 మంది ఈ వ్యాధి బారి పడుతున్నట్లు అంచనాలు ఉన్నాయన్నారు. లంగ్ క్యాన్సర్ ను ప్రాథమిక దశలోనే అతి చిన్న గడ్డలుగా ఉన్నపుడే గుర్తించి తద్వారా లంగ్ క్యాన్సర్ల కు సంపూర్ణ చికిత్స ను లంగ్ పాయింట్ ద్యారా అందించవచ్చని ఆయన తెలిపారు. కాగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, కొన్ని ఇతర దేశాల నుంచి వచ్చిన మూడు వందల మంది పైగా ప్రముఖ పల్మనాల జిస్టులకు దేశవిదేశాలకు చెందిన సుప్రసిద్ద వైద్యనిపుణులు ఈ అంతర్జాతీయ సదస్సు లైవ్ కార్యక్రమంలో శిక్షణ ఇచ్చారు. చైనా కి చెందిన డాక్టర్ చాంగ్ హూ జాంగ్, సింగపూర్ నుంచి వచ్చిన డాక్టర్ మెల్విన్ టే, మలేషియా కు చెందిన డాక్టర్ టై వాన్ సెక్ లతోపాటు మనదేశానికి చెందిన ప్రముఖ ఛాతీ వైద్య నిపుణులు ఫాకల్టీగా ఈ లంగ్ పాయింట్ లైవ్ చికిత్సా ప్రక్రియను వివరించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం సోమాజిగూడ లోని యశోద హాస్పిటల్స్ ఇంట్రవేన్షనల్ పల్మొనాలజిస్టులు డాక్టర్. వి. నాగార్జున మాటూరు, డాక్టర్. నవనీత్ సాగర్ రెడ్డి, డాక్టర్. రఘోత్తమ్ రెడ్డి నేతత్వంలో నిర్వహించారు.