Tuesday, 18 Feb, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
మాదక ద్రవ్యాల నియంత్రణా అవగాహన ప్రదర్శన

కృష్ణా : మాదక ద్రవ్యాల నియంత్రణకై తిరువూరు మండలం, గానుగపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు మంగళవారం గానుగపాడులో అవగాహన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు మంగళవారం మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణ పై ర్యాలీ చేపట్టారు. మత్తు పదార్థాలు వినియోగించవద్దని నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్మించారు. వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులను అందించారు. ఈ అవగాహన ప్రదర్శనలో పాఠశాల హెడ్‌ మాస్టర్‌ ఎంఆర్‌.శేషంరాజు, ఉపాధ్యాయులు గ్రామ సచి వాలయ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, విదార్థులు పాల్గన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top