Dailyhunt
మాల్దా ఘటన సూత్రధారి అరెస్టు

మాల్దా ఘటన సూత్రధారి అరెస్టు

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో బుధవారం సాయంత్రం ఏడుగురు జ్యుడిషియల్‌ అధికారులను నిరసనకారులు చుట్టుముట్టారు. న్యాయ నిర్ణయ పని నిమిత్తం కాలియాచక్‌కు వెళ్లిన ఏడుగురు అధికారులను మాల్దాలోని కాలియాచక్‌ బ్లాక్‌ 11 వద్ద నిరసనకారులు కొన్నిగంటల పాటు ఘెరావ్‌ చేశారు.

ఈ ఘటనకు కీలక సూత్రధారి అయిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇతని పేరు మోఫాక్కెరుల్‌ ఇస్లాం. వృత్తిరీత్యా న్యాయవాది. ఇట్టహార్‌ నివాసి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఘటనపై ఉత్తర బెంగాల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కె. జయరామన్‌ మీడియాతో మాట్లాడుతూ.. 'బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి రాష్ట్రం విడిచి పారిపోతుండగా ఇస్లాంను అడ్డుకుని నిర్బంధించాము. ఈ ఘటనపై 35 మందిని అరెస్టు చేశాం. 19 కేసులు నమోదు చేశాం' అని అన్నారు. ప్రజలకు నిరసన తెలిపే హక్కు ఉంది. అయితే వారు హింసకు పాల్పడకూడదని జయరామన్‌ అన్నారు.
కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేయమని ఎన్నికల సంఘం ఎన్‌ఐఎ (జాతీయ దర్యాప్తు సంస్థ)ను కోరింది. ఇక ఈ ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సిబిఐ లేదా ఎన్‌ఐఎతో దర్యాప్తు జరిపించమని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti