Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట వెలిగొండ నిర్వాసితుల నిరసన

మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట వెలిగొండ నిర్వాసితుల నిరసన

ప్రజాశక్తి-మార్కపురం : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ (పునరావాసం-పునరావాస పరిహారం) ప్యాకేజీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిర్వాసితులు మార్కాపురం కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి రమాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనకారులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాసితులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో కలెక్టరేట్‌ వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం నిర్వాసితులు కలెక్టరేట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం, పునరావాస సౌకర్యాలు వెంటనే కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti