బుద్ధగయ (బీహార్) : మయన్మార్ అధ్యక్షుడు యూ మిన్ ఆంగ్ హ్లైంగ్ భారత్ పర్యటనలో భాగంగా శనివారం మొదటగా బీహార్‌లోని బోధ్‌గయాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టు ద్వారా వెల్లడించారు.
మయన్మార్ అధ్యక్షుడిని బీహార్ విమానాశ్రయంలో ఆ రాష్ట్ర గవర్నర్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అత హస్నైన్ (రిటైర్డ్) ఆయనకు స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఆధ్మాత్మిక, చారిత్రక, ప్రజల మధ్య సంబంధాలను ఈ పర్యటన ద్వారా మరింత బలోపేతం చేయనుంది అని రణధీర్ జైశ్వాల్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
కాగా, నేడు మయన్మార్ అధ్యక్షుడు బీహార్‌లోని గయా జిల్లాలో ఉన్న బౌద్ధుల పుణ్య క్షేత్రాల్లో ఒకటైన మహబోధి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు యూ మిన్ భారత్ పర్యటన మే 30 - జూన్ 2 వరకు కొనసాగతుంది. యూమిన్ భారత్ పర్యటన ఇదే తొలిసారి. జూన్ 1వ తేదీన ఢిల్లీలో ప్రధాని మోడీతో ఈయన సమావేశం కానున్నారు. ఇరు నేతలు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. జూన్ 2వ తేదీన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.

