Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 9 న 'డైరెక్టర్స్ సాబ్' లఘు చిత్రం విడుదల

మే 9 న 'డైరెక్టర్స్ సాబ్' లఘు చిత్రం విడుదల

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక కళాకారుల ప్రతిభతో రూపొందిన 'డైరెక్టర్స్ సాబ్' అనే స్వతంత్ర చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

బుధవారం విజయనగరంలోని ధర్మపురిలో ఉన్న సిరి సహస్ర నిలయం (జడ్పీ క్యాంప్ కార్యాలయం) వేదికగా జరిగిన కార్యక్రమంలో చిన్న శీను సోల్జర్స్' అధ్యక్షురాలు సిరమ్మ ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సిరమ్మ మాట్లాడుతూ …. యువత తమలోని సృజనాత్మకతను చాటుకుంటూ ఇలాంటి వైవిధ్యభరితమైన చిత్రాలను నిర్మించడం అభినందనీయమని కొనియాడారు. 'ఎపిక్ ప్రెసెంట్' అనే అంతర్జాల వేదిక (యూట్యూబ్) ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రం అందరినీ అలరించాలని ఆమె ఆకాంక్షించారు. ఎపిక్ ప్రెసెంట్ అంతర్జాల వేదిక (యూట్యూబ్ ఛానల్) మే 9, 2026న కోరాడ సతీష్ దర్శకత్వంలో విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు కోరాడ సతీష్, ప్రధాన నటులు రాజేష్, జై నివాస్ మరియు చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. తమ ప్రయత్నాన్ని ప్రోత్సహించి, అండగా నిలిచిన సిరమ్మకు చిత్ర యూనిట్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti