ప్రజాశక్తి - ఉండ్రాజవరం: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం ముగిసినట్లు కస్టోడియన్ రూట్ ఆఫీసర్, వేలివెన్ను సెంటర్ల సిటింగ్ స్క్వాడ్ డి శారదా జ్యోత్స్న తెలిపారు.
ఎనిమిది ప్రభుత్వ, మూడు ప్రైవేటు పాఠశాలల నుండి విద్యార్థులకు మండలంలో మొత్తం ఐదు సెంటర్ల లో పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. షెడ్యూల్ ప్రకారం మార్చ్ 21న నిర్వహించాల్సి ఉండగా, రంజాన్ పండుగను పురస్కరించుకొని ఇంగ్లీషు పరీక్ష గురువారం నాటికి వాయిదా పడినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షలన్నీ ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని, విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

