తాడేపల్లి (అమరావతి) : సిఎం వైఎస్ జగన్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎపి ప్రత్యేక కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై కేబినెట్ చర్చించనుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై చర్చించే అవకాశం ఉంది. బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను కేబినెట్ ఆమోదించనుంది.

