Wednesday, 16 Oct, 1.35 am ప్రజాశక్తి

తాజావార్తలు
నేడు జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌ ఛైర్మన్‌ రాక

* 22 వరకు అధికారిక పర్యటన
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో
జాతీయ సఫాయి కర్మచారీ కమిషన్‌ ఛైర్మన్‌ మనహర్‌ వాల్‌జీభాయ్ జాలా బుధవారం రాష్ట్రానికి రానున్నారు. 22వ తేదీ వరకు ఆయన అధికారికంగా పర్యటించనున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె హర్షవర్థన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు, వెలగపూడి, విశాఖపట్నంలో ఆయన పర్యటిస్తారు. ఆయా మున్సిపాలిటీ సంఘాల ప్రతినిధులు, మాజీ ఎస్సీ కార్పొరేటర్లు, మాజీ ఎస్సీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, సోషల్‌ యాక్టివిస్టులు, ఎన్‌జీవోల ప్రతినిధులతో ఆయన సమావేశం కానున్నారు. వివిధ శాఖల అధికారులతో సఫాయి కర్మచారీలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. ది ప్రొఫెషన్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ఆన్‌ మాన్యువల్‌ స్కావెంజర్స్‌ అండ్‌ రీహాబిలిటేషన్‌ యాక్టు 2013, విధినిర్వహణలో ఉంటూ 1993 నుండి నేటి వరకు సెప్టిక్‌ ట్యాంక్‌ ఘటనల్లో మరణించిన వారికి రూ. 10లక్షల నష్టపరిహారం, వారి పిల్లల చదువులు, సామాజిక భద్రత తదితర అంశాలపై ఆయన చర్చించనున్నట్లు హర్షవర్థన్‌ పేర్కొన్నారు. సఫాయి కర్మచారీ ఉద్యోగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు, మాజీ ఎస్సీ ప్రజాప్రతినిధులతో 17న విజయవాడలోని విఎంసి కాన్ఫెరెన్స్‌హాలులో సమావేశం నిర్వహించనున్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top