Wednesday, 22 May, 7.09 am ప్రజాశక్తి

తాజావార్తలు
నేడు కుప్పం రానున్న చంద్రబాబు

కుప్పం: ఢిల్లీ పర్యటనలతో తీరిక లేకుండా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం 9:30 గంటలకు కుప్పం చేరుకోనున్నారు. ఇప్పటికే కుప్పం చేరుకున్న భార్య భవనేశ్వరితో కలిసి ఉదయం 10:30 గంటలకు స్థానిక ప్రసన్న తిరుపతి గంగమాంబ అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకుంటారు. అమ్మవారికి పట్టువస్త్రాలు, ఒడిబాల సమర్పిస్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం 11:30 గంటలకు బెంగళూరు వెళ్తారు. ముఖ్యమంత్రి కుప్పం రాక సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, మంగళవారం రాత్రే కుప్పం చేరుకున్న భువనేశ్వరి పీఈఎస్ వైద్య కళాశాల అతిథి గృహంలో బసచేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top