Dailyhunt
ఓడిపోయిన బెంగాల్, తమిళనాడు సిఎంలు

ఓడిపోయిన బెంగాల్, తమిళనాడు సిఎంలు

  • మమత, స్టాలిన్ కు ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ : ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు అంచనాలు మించి వస్తున్నాయి. ముఖ్యంగా బెంగాల్, తమిళనాడుల్లో ఫలితాలు ఆశ్చర్యకరంగా వస్తున్నాయి.

సోమవారం ఫలితాల్లో ఇక్కడ అధికార పార్టీలకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. ఎంతగా అంటే ఏకంగా ముఖ్యమంత్రులే ఓటమి చూవి చూశారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తాను పోటీ చేసిన భవానీపూర్ స్థానం నుంచి ఓటమిపాలయ్యారు. ఇక్కడ బిజెపి అభ్యర్థి సువేందు అధికారి చేతిలో ఏకంగా 15 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. సువేందు అధికారి నంది గ్రామ్ స్థానంలో నుంచి పోటీ చేసి గెలిచారు. 2021లోనూ మమతా బెనర్జీని సువేందు అధికారి నంది గ్రామ్ లో ఓడించిన విషయం తెలిసిందే. దీంతో తరువాత ఆమె భవానీపూర్ లో ఉప ఎన్నికల్లో పోటీ చేసిన తన ముఖ్యమం త్రి పదవిని నిలబెట్టుకున్నారు. ఇప్పుడూ భవానీపూర్ లోనూ పోటీ చేసిన ఆమెను సువేందు అధికారి ఓడించారు.

9 వేల ఓట్లతో స్టాలిన్ ఓటమి…
తమిళనాడు ముఖ్యమం త్రి ఎంకె స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓటమి చవిచూశారు. టివికె అభ్యర్థి వి.ఎస్. బాబు ఈ స్థానం నుంచి 9 వేల ఓట్లతో విజయం సాధించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti