బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా, దక్షిణాది హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'సిస్టమ్'. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
బావేజా స్టూడియోస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథ మొత్తం ఒక ఆసక్తికరమైన న్యాయపోరాటం చుట్టూ తిరుగుతుంది. వేర్వేరు సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన ఇద్దరు మొండి పట్టుదల గల మహిళల మధ్య జరిగే ఘర్షణే ఈ చిత్ర ప్రధాన స్టోరీ. ఇందులో ఒకరు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కనిపిస్తే, మరొకరు కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా తనదైన శైలిలో పోరాడతారు. అధికారం ఉన్నవారికే చట్టం చుట్టూ తిరిగే నేటి వ్యవస్థలోని లోపాలను, నిజం కంటే పదవికే ప్రాముఖ్యత ఇచ్చే పరిస్థితులను ఈ ఇద్దరు మహిళలు ఎలా ఎదుర్కొన్నారనేది ఈ సినిమా ఇతివృత్తం.ఈ చిత్రం నేరుగా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. మే 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ ఒక కీలక పాత్రలో నటించారు.

